Explore Categories

 

 PDF

TallyPrime మరియు TallyPrime Edit Log Release 3.0.1 కి సంబంధించిన Release Notes | కొత్త విషయాలు తెలుసుకోండి!

e-Invoicing మరియు GST return file చేసే మొత్తం ప్రక్రియలో అద్భుతమైన మరియు అత్యంత మెరుగైన అనుభూతిని TallyPrime Release 3.0.1 మీ ముందుకు తెస్తోంది.

మీరు మీ అనేక సమస్యలను సులభమైన రీతిలో చాలా త్వరగా resolve చేయడానికి e-Invoice report మీకు సహాయపడుతుంది. దీని ద్వారా మీకు portal లో rejections చాలా వరకు తగ్గుతాయి. మీ GST అనుభూతిని మరింత ఆనందకరం చేయడానికి export మరియు HSN/SAC లో మెరుగులు చేయబడ్డాయి.

మీరు TallyPrimeలో customisation ఉపయోగిస్తుంటే, తాజా విడుదలకు అప్‌గ్రేడ్ చేయడానికి ముందు మీ partner ని సంప్రదించడం ఉత్తమం. మీరు multi-user సెటప్‌లో పని చేస్తుంటే, మొదట సర్వర్‌లో అప్‌గ్రేడ్ చేసి ఆపై క్లయింట్‌లో అప్‌గ్రేడ్ చేయండి.

e-Invoicing

మీ e-Invoicing అనుభూతిని ప్రభావవంతంగా మెరుగుపరిచేలా ఈ క్రింది పునర్వర్తనలతో e-Invoicing ఫీచర్ మీ ముందుకు వస్తోంది.

e-Invoicing details ని సులభంగా సరిచేయడం

మీరు e-Invoices generate చేసే సమయంలో, అందులో ఉన్న తప్పులను మరియు మిస్ అయిన వివరాలను ఇప్పుడు మరింత సులభంగా కనుక్కోగలరు. మీరు అవసరమైన మార్పులు ట్యాలీ ప్రైమ్ లోనే చేయడానికి e-Invoice report మీకు సహాయపడుతుంది. తద్వారా e-Invoice portal లో reject అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

తదనుగుణంగా, మీరు Uncertain Transactions లో నుండి ఈ క్రింది సమస్యలను ఎంతో సులభంగా పరిష్కరించుకోగలరు:

  • కన్సైనీ (షిప్ టూ) & డిస్పాచ్ ఫ్రం లో మిస్సింగ్ లేదా చెల్లని రాష్ట్రం పేరు
  • రాష్ట్రం మరియు పిన్‌కోడ్ మధ్య అసమతుల్యత
  • HSN మరియు  Type of supply మధ్య అసమతుల్యత
  • సున్నా(జీరో) నుంచి మొదలయ్యే ఇన్వాయిస్ నెంబర్లు

మరిన్ని వివరాల కొరకు e-Invoice – FAQ లో  e-Invoice Reports   విభాగాన్ని సంప్రదించగలరు.

Billed Quantity మరియు  Actual Quantity తో e-Invoicing

ఇప్పుడు మీరు Billed Quantity మరియు Actual Quantity తో e-Invoicing ని సజావుగా (హ్యాండిల్)పూర్తి చేయగలరు. 

e-Invoice generate చేసే సమయంలో, మీ లావాదేవీలలో Actual Quantity విలువ కంటే Billed Quantity విలువ ఎక్కువ ఉన్నప్పటికి ఎటువంటి సమస్యలు ఉండవు.

విదేశీ parties తో e-Invoicing

ఇప్పుడు విదేశీ parties కోసం e-Invoices generate చేయటం చాలా సులభం అయ్యింది.

India బయట ఉన్న party కి service అందిస్తూ bill స్థానిక లేదా అంతర్రాష్ట్ర party కి ఇస్తున్ననూ, e-invoice generate చేయడం లో మీకు ఏ విధమైన సమస్యలు ఉండవు. 

e-invoice లో Dispatch From వివరాలు

మీరు e-Invoice లావాదేవీలు రికార్డు చేసే సమయంలో, Dispatch From వివరాలు ఇప్పుడు మరింత స్పష్టంగా ప్రదర్శింపబడతాయి.

Provide Dispatch From details ఆప్షన్ ను కేవలం ఒకటే సారి ఎనేబుల్ చేయడం ద్వారా, ఆ తరువాత నుండి తదుపరి లావాదేవీలలోని వివరాలను మీరు ఎంతో సులువుగా చూడగలరు మరియు update చేయగలరు. 

e-Invoice తో పాటుగా e-Way Bill

e-Invoice తో పాటుగా e-Way Bill generate చేయడం ఇప్పుడు మరింత సులభం అయ్యింది.

credit notes కి మరియు Threshold limit కన్నా తక్కువగా ఉన్న  transactions కి e-Way Bill చాలా జావుగా generate చేయగలరు.

UoM  లేకుండా e-Invoicing

e-Invoicing లో UoMs ను వాడటం ఇప్పుడు మరెంతో సులభం అయ్యింది.

ఏ UoM వాడని పక్షంలో కూడా goods and services కొరకు e-Invoices చాలా సులువుగా generate చేయగలరు.

Party GSTIN/UIN is the same as Company GSTIN/UIN

మీ party GSTIN/UIN మరియు Company GSTIN/UIN ఒకటే నా? అదేమి ఇబ్బంది కాదు! ఇప్పుడు మీరు అటువంటి లావాదేవీలను సులువుగా పోర్టల్ లో అప్లోడ్ చేయగలరు.

మీరు కేవలం Uncertain Transactions వద్దకు చేరుకొని Party GSTIN/UIN is the same as Company GSTIN/UIN సెక్షన్ లో సంబంధిత transactions ను accept చేసినచో, మీ transactions upload చేయడానికి సిద్ధం గా ఉంటాయి.

మరిన్ని వివరాల కొరకు e-Invoice – FAQ లో  e-Invoice Reports   విభాగాన్ని సంప్రదించగలరు.

GST

మీ return filing అనుభూతిని మెరుగుపరిచేలా ఈ క్రింది మెరుగుదలలతో GST మాడ్యూల్  మీ ముందుకు వస్తోంది.

ఖాళీ HSN/SAC వద్ద Accept As Is ఆప్షన్

ఒకవేళ మీ వ్యాపార వార్షిక turnover 5 కోట్ల కన్నా తక్కువ ఉన్న పక్షంలో, HSN/SAC వివరాలు పేర్కొనడం ఐచ్ఛికం అగును. తదనుగుణంగా, ఇటువంటి transactions ను (Uncertain Transactions నుండి) accept చేసి, వాటిని కూడా పరిగణించగలిగే అద్భుతమైన వశ్యత ను TallyPrime మీకు అందిస్తోంది. 

GSTR-3B నుండి JSON

JSON ఉపయోగించి GSTR-3B file చేయడం ఇప్పుడు మరింత సులభం అగును.

TallyPrime నుండి export చేయబడిన GSTR-3B JSON ఇప్పుడు అన్ని సెక్షన్స్ మరియు లావాదేవీల వివరాలు కలిగి ఉంటుంది. zero-valued సెక్షన్స్ కూడా ఎంతో సజావుగా export చేయవచ్చు. తద్వారా మీరు మీ అవసరాన్ని బట్టి  portal నందు విలువలను update చేయగలరు.

Post a Comment

Is this information useful?
YesNo
Helpful?