HomeTallyPrimeWhat's New | Release NotesRelease 3.0 - తెలుగు

 

Explore Categories

 

 PDF

TallyPrime Release 3.0 ಮತ್ತು TallyPrime Edit Log Release 3.0 ರಿಲೀಸ್ ನೋಟ್ಸ್ | ಹೊಸದೇನಿದೆ ತಿಳಿಯಿರಿ

GST

ట్యాలీ ప్రైమ్ మరియు ట్యాలీ ప్రైమ్ ఎడిట్  లాగ్  రిలీజ్ 3.0 మీ జి.స్.టి వాడుక అనుభవాన్ని మరింత ఆనందం మరియు సౌకర్యాన్ని కలిగించివుంటాయి 

మాస్టర్స్‌లో జి.స్.టి రేటు మరియు HSN/SAC వివరాలను విడివిడిగా పేర్కొనే సదుపాయం మరియు వాల్యుస్ ని ఒవర్రైడ్ చేయడాన్ని సులభతరం చెయ్యడం వలన మీకు GST లావాదేవీలను రికార్డింగ్ చేయడం మరింత సులభం అవుతుంది

టాక్స్ లయబిలిటిని నమోదు చెయ్యడానికి  మరియు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడానికి జర్నల్ వోచర్‌లను సృష్టించాల్సిన అవసరం లేకుండా,లావాదేవీలలో పేర్కొన్న విలువల ప్రకారం మీ జి.స్.టి రిటర్న్ రిపోర్ట్‌లు అప్‌డేట్ అయ్యేలా ప్రోడక్ట్  జాగ్రత్త తీసుకుంటుంది. అయినప్పటికీ, అవసరమైతే, జర్నల్ వోచర్‌లను రికార్డ్ చేసుకోవడానికి కూడా  మీకు సౌలభ్యం ఉంది.

పైగా, ఇప్పుడు మీరు GSTR-1, GSTR-2A మరియు GSTR-2B యొక్క ట్రాన్సక్షన్స్ (లావాదేవీలను) చాలా సులభంగా రికన్సైల్  (సమన్వయ పరచుట) చేయవచ్చు. జి.స్.టి-సంబంధిత డేటాను రీసెట్ చేసే సదుపాయం, జి.స్.టి వివరాలతో సరిపోని పక్షంలో, రికన్సిలియాషన్ కోసం GST పోర్టల్ నుండి దిగుమతి చేసుకున్న GST డేటాను తొలగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మీరు GST పోర్టల్ డేటాతో సరిపోవడానికి వాల్యూస్ను  మళ్లీ నమోదు చేయవచ్చు, ఆపై  ట్రాన్సక్షన్స్ (లావాదేవీలను) సరిచేయడానికి పోర్టల్ డేటాను మళ్లీ దిగుమతి చేసుకోవచ్చు.

దానికి అదనంగా, ఒక నిర్దిష్ట లేదా అన్ని జి.స్.టి రిజిస్ట్రేషన్ల లావాదేవీలను అవసరమైన విధంగా ఎగుమతి  మరియు దిగుమతి డేటా ఎక్స్ఛేంజ్ ఆప్షన్ ద్వారా  చేసుకోవచ్చు

Payment Request

డబ్బు చెల్లించమని విన్నపము ( పేమెంట్ రిక్వెస్ట్ )

టాలీ ప్రైమ్  ఇప్పుడు చెల్లింపు అభ్యర్థన లక్షణంతో (ఫీచర్ ) వస్తుంది, ఇది చెల్లింపు లింక్స్ మరియు క్యూఆర్ కోడ్‌లను (చెల్లింపు గేట్‌వే లేదా UPI ఉపయోగించి) సులభంగా ఉత్పత్తి చేసి ఇంకొకరికి పంపిచండానికి  మీకు సహాయపడుతుంది. ఈ లక్షణం తో (ఫీచర్) మీరు సులభంగా మరియు తక్షణమే మీ యొక్క వినాయగదారులతో  చెల్లింపులను పూర్తి చేసుకోగలరు.

Data Exchange and Data Management

మీరు ఇప్పుడు మీకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు మరియు మీ వ్యాపార డేటాను మరింత వేగంతో విశ్లేషించవచ్చు, ఎందుకంటే ఇపుడు కొన్ని క్లిక్‌లలో కొత్త రిపోర్ట్ ఫిల్టర్‌లు, రిపోర్ట్‌లలో అవసరమైన వివరాలను త్వరగా యాక్సెస్ చేయడంలో మీకు సహాయపడతాయి.

మైగ్రేషన్, రిపేర్ మరియు దిగుమతి వంటి డేటా మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు ఇక పై  చాలా సునాయాసంగా చేయగలుగుతారు, ఎందుకంటే మీరు ప్రక్రియ యొక్క దశలను ఒకొకటిగా  తెలుసుకుంటారో, అదే సమయంలో  సమ్మరీ రిపోర్ట్ (సారాంశ నివేదిక) మాస్టర్‌లు మరియు వోచర్‌ల ప్రారంభం మరియు పూర్తి  అయినా ప్రక్రియ గురుంచి మీకు తెలియజేస్తుంది. మరోవైపు, ప్రక్రియ సమయంలో సంభవించిన లోపాలను గుర్తించడం మరియు పరిష్కరించడం చాలా సులభం.

మీరు ట్యాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ యూజర్ అయితే, మీరు ట్యాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ రిలీజ్ 3.0 ని  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్యాంశాలు – ట్యాలీ ప్రైమ్ మరియు ట్యాలీ ప్రైమ్ ఎడిట్ రిలీజ్ 3.0

ఒకే కంపెనీ లో  బహుళ (మల్టిపుల్) జి.స్.టి రెజిస్ట్రేషన్స్ 

ఒకే కంపెనీ డేటాలో బహుళ జి.స్.టి రిజిస్ట్రేషన్‌లు సరళమైన జి.స్.టి రిటర్న్-ఫైలింగ్ అనుభవాన్ని తెస్తుంది, ఎందుకంటే మీరు ఒకే కంపెనీ డేటా యొక్క జి.స్.టి నివేదికలను ఉపయోగించి ప్రతి జి.స్.టి రిజిస్ట్రేషన్‌కు విడిగా జి.స్.టి రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఇప్పటినుచి  వివిధ జి.స్.టి రిజిస్ట్రేషన్‌ల కోసం వివిధ కంపెనీ డేటాను నిర్వహించడంలోని ఇబ్బంది ఇక మీదట ఉండదు.

మీ అన్ని జి.స్.టి రిజిస్ట్రేషన్‌లను ఒకే కంపెనీలో నిర్వహించే సదుపాయంతో, మీరు ఇప్పుడు క్రింద వన్నీ చేయవచ్చు:

  • కంపెనీలో జి.స్.టి రిజిస్ట్రేషన్‌లను క్రింద వాటితో  సృష్టించండి:
    • రాష్ట్రం, చిరునామా రకం, రిజిస్ట్రేషన్‌ రకం మరియు GSTIN/UIN వంటి అన్ని జి.స్.టి నమోదు వివరాలు
    • రిటర్న్ ఫైలింగ్ యొక్క  కాల పరిమితి
    • ప్లేస్ అఫ్ సప్లై
    • ఇ-ఇన్‌వాయిస్ మరియు ఇ-వే బిల్లు యొక్క  వర్తింపు
    • రికన్సిలియాషన్ కాన్ఫిగరేషన్ (ఆకృతీకరణ)
    • LUT/బాండ్ వివరాలు, వర్తించిన విధంగా
    • GST రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ఇతర వివరాలు
  • లావాదేవీలను ఈ ప్రకారంగా నమోదు చేయండి:
    • నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్‌కు నిర్దిష్ట జి.స్.టి నియమాలు వర్తిస్తాయి.
    • GSTIN/UIN మరియు చిరునామా వంటి సమాచారం జి.స్.టి రిజిస్ట్రేషన్‌ల కోసం అందించడం.
  • విరుద్ధమైన (కాంఫ్లిక్టింగ్ ) వోచర్ నంబర్‌లను నివారించడానికి ప్రతి జి.స్.టి రిజిస్ట్రేషన్కి ఒక  వోచర్ సిరీస్‌ని సృష్టించండి.
  • మీ తక్షణ ప్రమాణము (రిఫరెన్స్) కోసం ఎక్కువ వేగంతో ప్రదర్శించబడే జి.స్.టి రిటర్న్ నివేదికలను (రిపోర్ట్‌లను) తెరవండి.
  • నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్ లేదా అన్ని రిజిస్ట్రేషన్‌ల కోసం అవసరమైన జి.స్.టి రిటర్న్‌లను ఎగుమతి చేయండి.
  • ఇ-ఇన్‌వాయిస్ మరియు ఇ-వే బిల్ కార్యకలాపాల కోసం లాగిన్ చేయడానికి నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్ యొక్క క్రెడెన్షియల్స్ ఉపయోగించండి.

అంతే కాకుండా,  మీరు జి.స్.టి రిజిస్ట్రేషన్‌ని తాత్కాలికంగ  తొలగించినప్పుడు లేదా సరెండర్ చేసినప్పుడు ఆ నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్‌ను మాత్రమే డియాక్టివేట్ చేయవచ్చు మరియు మీకు అవసరమైనప్పుడు జి.స్.టి రిజిస్ట్రేషన్‌ని మళ్లీ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

జి.స్.టి వివరాలను పేర్కొనడం

మీరు ఇప్పుడు జి.స్.టి రేటు మరియు HSN/SACకి సంబంధించిన వివరాలను వివిధ రకాల మాస్టర్‌లలో ప్రత్యేకంగా నమోదు చేయడానికి  మరియు నవీకరించడానికి వెసులుబాటును కలిపించబడింది. దీని వల్ల, ఇప్పుడు  పార్టీ యొక్క జి.స్.టి వివరాలను నవీకరించడం సులభతరం అవుతుంది . ఇంకా, మీరు ఏదైనా మాస్టర్‌లో స్లాబ్ రేట్లను పేర్కొనవచ్చు – అది స్టాక్ ఐటెమ్, స్టాక్ గ్రూప్, లెడ్జర్ లేదా గ్రూప్ కావచ్చు.

జి.స్.టి రేట్ మరియు HSN/SAC వివరాలు 

ఇప్పుడు జి.స్.టి రేటు మరియు HSN/SAC వివరాలను నమోదు చేయడం చాలా సులభం, ఎందుకంటే మీరు ఆ వివరాలను మీ అవసరానికి అనుగుణంగా ప్రత్యేక మాస్టర్‌లలో నమోదు చేయవచ్చు. మరోవైపు, వోచర్ సృష్టి సమయంలో ఉన్న వివరాలను మార్చిరాసే సదుపాయం గొప్ప సౌలభ్యాన్ని అందిస్తుంది.

ఇప్పుడు మీరు:

  • జి.స్.టి రేటు మరియు HSN/SAC వివరాల మూలాన్ని F11 కంపెనీ ఫీచర్‌ల కింద సెట్ చేయండి.
    ఆ తర్వాత, మీరు వోచర్‌ను సృష్టించినప్పుడు, జి.స్.టి రేట్ మరియు HSN/SAC వివరాలు F11 కంపెనీ ఫీచర్‌ల క్రింద సెట్ చేయబడిన  మూలం ( సోర్స్ ) నుండి పరిగణించబడతాయి.
  • ఒక మాస్టర్‌లో (స్టాక్ గ్రూప్ వంటివి) జి.స్.టి రేట్ వివరాలను మరియు మరొక మాస్టర్‌లో HSN/SAC వివరాలను (స్టాక్ ఐటెమ్ వంటివి) అప్‌డేట్ చేయడానికి ఎంచుకోండి.
  • ఏదైనా ఇతర మాస్టర్‌లో లేదా వోచర్ సృష్టి సమయంలో జి.స్.టి మరియు HSN/SAC వివరాలను మార్చి రాయవచ్చు .

జి.స్.టి రిజిస్ట్రేషన్‌ వివరాలు

మీరు ఇప్పుడు మాస్టర్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం జి.స్.టి నమోదు వివరాలు (GSTIN మరియు రిజిస్ట్రేషన్ రకం వంటివి) మరియు మెయిలింగ్ వివరాలను (చిరునామా, రాష్ట్రం లేదా దేశం వంటివి) అప్‌డేట్ చేయవచ్చు, ఆ విధంగా వీటిపై ఎటువంటి ప్రభావం ఉండదు:

  • ఇంతకు ముందు నమోదు చేసిన లావాదేవీలు పై .
  • గత నెలల్లో దాఖలు చేసిన రిటర్న్స్ పై.

అంతేకాదు, జి.స్.టి రిజిస్ట్రేషన్ వివరాలలో అప్‌డేట్‌లను చూడడానికి  కొత్తగా ప్రవేశపెట్టిన సదుపాయంతో, మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు:

  • జి.స్.టి రిజిస్ట్రేషన్ వివరాలలో అప్‌డేట్‌ల స్వభావం
  • అప్‌డేట్‌లు చేయబడిన తేదీ

మాస్టర్స్‌లో ని  స్లాబ్ రేటు

విభిన్న మొత్తాల స్లాబ్‌ల కోసం వివిధ రకాల GST రేట్‌లతో ఉన్న వస్తువులు లేదా సేవల కోసం, మీరు ఇప్పుడు స్టాక్ వస్తువులలో మాత్రమే కాకుండా స్టాక్ గ్రూప్, లెడ్జర్ మరియు కంపెనీలో కూడా అవసరమైన విధంగా స్లాబ్ రేట్లను నమోదుచేయవచ్చు.

జి.స్.టి ట్రాన్సక్షన్స్ 

ట్యాలీ ప్రైమ్  జి.స్.టి రేట్ మరియు సంబంధిత మాస్టర్‌లలో అందించిన HSN/SAC వివరాలను పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి లావాదేవీలలో పన్నును లెక్కించడం చాలా సులభం అయింది, అయితే మీరు వోచర్ సృష్టి సమయంలో అవసరమైన వివరాలను మార్చి రాయ వచ్చు.

ట్యాలీ ప్రైమ్ రిలీజ్ 3.0 తో, ఇప్పుడు మీరు:

  •  మీరు ఒకే కంపెనీలో బహుళ జి.స్.టి రిజిస్ట్రేషన్‌లను నిర్వహిస్తున్నప్పుడు, ఏ జి.స్.టి రిజిస్ట్రేషన్‌ల లావాదేవీలను అయినా  రికార్డ్ చెయ్యవచ్చు’
  • ప్రతి లెడ్జర్ లో నేచర్ అఫ్ ట్రాన్సాక్షన్ నమోదు చెయ్యడానికి బదులుగా వోచర్‌లో లావాదేవీ స్వభావాన్ని సెట్ చేయండి.
  • లావాదేవీలలో జి.స్.టి రేట్లు మరియు HSN/SAC కోడ్‌లను చాలా సులభంగా మార్చి రాయండి.
  • లావాదేవీ యొక్క జి.స్.టి స్టేటస్‌ని అవసరమైన విధంగా రికన్సైల్డ్, అన్‌రికన్సైల్డ్, మిస్మట్చెడ్ (అసమతుల్యత) లేదా మినహాయించబడిన వాటికి మార్చండి.

మీరు ఇప్పుడు GSTR-2A సమన్వయ నివేదిక లో బహుళ లావాదేవీల ఒకేసారి చేయవచ్చు .

  • రిటర్న్ ఎఫెక్టివ్ తేదీని మార్చడం ద్వారా, వోచర్‌ను వేరే రిటర్న్ పీరియడ్‌కి తరలించండి.

మీరు GSTR-1, GSTR-3B మరియు GSTR-2A రికన్సిలియాషన్ వంటి జి.స్.టి రిటర్న్ నివేదికలలో బహుళ లావాదేవీల కోసం కూడా అలా చేయవచ్చు

  • రిటర్న్‌ను సంతకం చేసినట్లు గుర్తు పెట్టండి, తద్వారా మీరు రిటర్న్‌పై సంతకం చేసిన తర్వాత చేసిన ఏవైనా మార్పులను ట్రాక్ చేయవచ్చు.
  • రిటర్న్ ఎఫెక్టివ్ తేదీని నమోదు చెయ్యడం  ద్వారా భవిష్యత్ లో ని  టర్న్ ఎఫెక్టివ్ తేదీ వోచర్‌ను సవరించండి.
  •  చట్టపరమైన (స్టాట్యూటరీ)  అడ్జ్స్ట్మెంట్స్  విస్తృత శ్రేణి ఎంపికల నుండి ఎంచుకోవడం ద్వారా GST సర్దుబాట్లను చేయడం ద్వారా  వివిధ రకాల మీ వ్యాపార దృశ్యాలు (సినారియోస్)  మరియు పద్దతులను చూడొచ్చు.

చట్టబద్ధమైన సర్దుబాట్ల కోసం అందించబడిన ఎంపికలలో టాక్స్ లయబిలిటీ పెరుగుదల, ఇన్‌పుట్  టాక్స్ క్రెడిట్‌ పెరుగుదల మరియు ఇతర   అడ్జ్స్ట్మెంట్స్ ఉన్నాయి

  • మాస్టర్ నుండి జి.స్.టి  రిజిస్ట్రేషన్ వివరాలను  సులభంగా  లావాదేవీకి కాపీ చేయండి

జి.స్.టి  రిజిస్ట్రేషన్ వివరాలుఇవి కలిగి ఉంటాయి  :

    • సంస్థ జి.స్.టి  రిజిస్ట్రేషన్ వివరాలు (సవరించలేనివి)
    • పార్టీ జి.స్.టి  రిజిస్ట్రేషన్ వివరాలు
    •  పన్ను (టాక్స్ ) రేటు వివరాలు
    • HSN/SAC వివరాలు
    • అంచనా వేయదగిన విలువలో (ఇంక్లూడ్ ఇన్ అస్సెస్సాబుల్ వాల్యూ) చేర్చండి అనే సెట్టింగ్
  • పోర్టల్‌లో కనిపించే విధంగానే వోచర్ యొక్క జి.స్.టి, ఇ-ఇన్‌వాయిస్ మరియు ఇ-వే బిల్ డేటాను వీక్షించండి.

పైన పేర్కొన్న సౌకర్యాలు కాకుండా, మీరు వీటిని కూడా చేయవచ్చు:

  • మెటీరియల్ ఇన్ మరియు మెటీరియల్ అవుట్ వోచర్‌లలో జి.స్.టి ని లెక్కించండి.
  • కొనుగోలు వోచర్‌లలో పన్ను విశ్లేషణను (టాక్స్ ఎనాలిసిస్ ) వీక్షించండి.
  • దేశీయ మరియు అంతర్జాతీయ సరఫరాదారుల యొక్క ప్లేస్ అఫ్ సప్లైని  ఎంచుకోండి

అంతేకాదు, మీరు GST రిటర్న్‌లను ప్రభావితం చేసే విలువను మార్చినట్లయితే, TallyPrime వోచర్‌ను మళ్లీ సేవ్ చేసే సమయంలో మిమ్మల్ని ప్రాంప్ట్ హెచ్చరిస్తుంది, తద్వారా మీరు ఈ క్రింది నిర్ణయాలలో ఒకదాన్ని  మీరు  తీసుకోవచ్చు: 

  • విలువలలో తేడాతో అంగీకరించండి మరియు అసమతుల్యతను (మిస్మాట్చ్) తర్వాత పరిష్కరించండి.
  • విలువలలో తేడాతో అంగీకరించండి, అయితే వోచర్ సరిపోలనిదిగా (మిస్మాట్చ్) పరిగణించబడదని నిర్ధారించుకోండి. 
  • అవసరమైతే, వోచర్‌కి తిరిగి వెళ్లి, అసలు విలువలకు తిరిగి వెళ్లండి

వోచర్ రకం కోసం డిఫాల్ట్ GST రిజిస్ట్రేషన్

బహుళ GST రిజిస్ట్రేషన్ల విషయంలో, మీరు నిర్దిష్ట వోచర్ రకానికి డిఫాల్ట్ జి.స్.టి రిజిస్ట్రేషన్‌ని సెట్ చేయవచ్చు.

ఉదాహరణకు, మీరు నిర్దిష్ట కార్యాలయం లేదా ప్రదేశము  సంబంధించిన అన్ని జర్నల్ వోచర్‌లను రికార్డ్ చేసినట్లయితే, మీరు ఆ లొకేషన్ యొక్క జి.స్.టి రిజిస్ట్రేషన్‌ని వోచర్ టైప్‌లో డిఫాల్ట్‌గా సెట్ చేయవచ్చు.

తరువాత, మీరు వోచర్‌ను సృష్టించినప్పుడు, డిఫాల్ట్ జి.స్.టి రిజిస్ట్రేషన్ వోచర్ రకంలో ఎంపిక చేయబడుతుంది, తద్వారా జి.స్.టి రిజిస్ట్రేషన్‌ల మధ్య మారడానికి వినియోగించే సమయం ఆదా అవుతుంది.

ఆటోమేటిక్ లేదా మల్టీ యూజర్ ఆటో కోసం ఒరిజినల్ వోచర్ నంబర్‌ల నిలుపుదల (రిటెన్షన్)

వోచర్ నంబరింగ్ యొక్క ఆటోమేటిక్ లేదా  మల్టీ యూజర్ ఆటో పద్ధతిని కలిగి ఉన్న వోచర్ రకాల కోసం, టాలీ ప్రైమ్ మధ్యలో వోచర్ ని నమోదు చేసిన లేక తొలగించిన అసలు వోచర్ సంఖ్యను అలాగే ఉంచుతుంది. 

దీని వల్ల కొత్త వోచర్ ను నమోదు చేసిన లేక తొలగించిన  లావాదేవీల యొక్క వోచర్ సంఖ్య అలాగే ఉంటుంది.

అయినప్పటికీ, మీరు మీ వ్యాపారంలో ని పద్దతి ప్రకారం, కొత్త వోచర్ ను మధ్యలో నమోదు చేసిన లేక తొలగించిన, వోచర్ సంఖ్య ను మల్లి తిరిగి నమోదు చెయ్యవచ్చు.

నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్ కోసం వోచర్ సిరీస్

బహుళ జి.స్.టి రిజిస్ట్రేషన్‌లు ఉన్న కంపెనీల కోసం, మీరు ప్రతి రిజిస్ట్రేషన్ మరియు వోచర్ రకానికి వోచర్ నంబరింగ్ సిరీస్‌ని సృష్టించవచ్చు, తద్వారా మీ డేటాలో మరియు రిటర్న్‌లలో కూడా అదే వోచర్ నంబర్‌ల వైరుధ్యం (కాన్ఫ్లిక్ట్) ఉండదు.

జి.స్.టి రిటర్న్స్ 

ట్యాలీ ప్రైమ్ రిలీజ్ 3.0 మీ తక్షణ ప్రమాణము (రిఫరెన్స్) కోసం జి.స్.టి రిటర్న్‌లను చాలా వేగంగా తెరవడాన్ని అనుమతిస్తుంది. అంతేకాకుండా, GSTR-1 మరియు GSTR-3B వంటి జి.స్.టి నివేదికలు మెరుగుపరచబడినందున జి.స్.టి రిటర్న్‌లను ఫైల్ చేయడం చాలా సులభం అవుతుంది, తద్వారా మీరు సులువుగా ఇప్పుడు ఈ క్రింద చెప్పబడినవి  చేయవచ్చు:

  • నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్ లేదా అన్ని జి.స్.టి రిజిస్ట్రేషన్‌ల కోసం అవసరమైన జి.స్.టి రిటర్న్‌లను వీక్షించండి.
  • ట్రాక్ జి.స్.టి రిటర్న్ యాక్టివిటీస్ రిపోర్ట్‌ని ఉపయోగించి అన్ని కాలాల్లో రిటర్న్ ఫైల్ చేయడానికి పెండింగ్‌లో ఉన్న అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించండి.
  • అనిశ్చిత (అన్సర్టెన్ ) లావాదేవీలను మరింత సులువుగా పరిష్కరించండి.
  • పన్ను సంబంధిత విలువల్లో అసమతుల్యత ఉన్నప్పటికీ లావాదేవీలను యథాతథంగా తీసుకుంటుంది మరియు చెల్లుబాటు అయ్యేలా అంగీకరించబడిన లావాదేవీలను ఉపయోగించి చెల్లుబాటు అయ్యే నివేదికను తయారు చేసి ఇస్తుంది.
  • మీరు నిర్దిష్ట లావాదేవీలను వేరొక రిటర్న్ పీరియడ్‌కి తరలించాలనుకుంటే, ఒకటి కంటే ఎక్కువ లావాదేవీలకు రిటర్న్ ఎఫెక్టివ్ తేదీని సెట్ చేయండి.
  • అవసరమైతే, కొత్త రిటర్న్ ఎఫెక్టివ్ తేదీతో సంతకం చేసిన రిటర్న్ నుండి లావాదేవీని సవరించండి.
  • ఎగుమతి చేసిన తర్వాత సవరించబడిన లేదా తొలగించబడిన లావాదేవీలను గుర్తించండి.
  • ట్రాక్ జి.స్.టి రిటర్న్ యాక్టివిటీస్ రిపోర్ట్‌ని చూడండి:
    • అనిశ్చిత లావాదేవీల పరిష్కారం, ఎగుమతి మరియు సంతకం వంటి వాయిదా వేయబడిన  కార్యకలాపాలను గుర్తించండి.
    • మీరు సకాలంలో రిటర్న్‌లను ఫైల్ చేయగలిగేలా కార్యకలాపాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోండి.
  • రికార్డ్ చేయబడిన లావాదేవీలు మరియు అమలు చేయాల్సిన చర్యల ఆధారంగా కనిపించే సంబంధిత విభాగాలతో అప్‌డేట్ అయిన నివేదికను వీక్షించండి.
  • ఒక కల వ్యవధి లో వాయిదా  ఉన్న చర్యలను గుర్తించండి, అవి ఎంబెర్ (కాషాయ రంగులో ఒక వర్ణం)   హైలైట్ చేయబడతాయి.
  • ఎగుమతి చేయవలసిన రిటర్న్ సమాచారాన్ని సమీక్షించడానికి ప్రివ్యూ నివేదికను చూడండి.
  • నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్ లేదా అన్ని రిజిస్ట్రేషన్‌ల కోసం అవసరమైన జి.స్.టి రిటర్న్‌లను ఎగుమతి చేయండి

ట్యాలీ ప్రైమ్ లో ఎగువ మెను కింద ఉన్న Exchange  నుండి మీరు అలా చేయవచ్చు:

    • బహుళ జి.స్.టి రిజిస్ట్రేషన్‌ల విషయంలో అన్ని జి.స్.టి రిజిస్ట్రేషన్‌లు లేదా నిర్దిష్ట జి.స్.టి రిజిస్ట్రేషన్‌ కోసం.
    • విభాగాల వారీగా JSON ఫైల్‌లతో, అవసరమైన విధంగా.
    • మీకు నచ్చిన ఫార్మాట్‌లో – JSON, MS Excel లేదా CSV.
    • MS Excelలో GSTR-3B డేటాతో.

ఇది GST పోర్టల్‌లోని Excel యుటిలిటీకి సరిగ్గా సమానంగా ఉంటుంది, ఇది GSTR-3Bని ఫైల్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.

రికన్సెయిల్ ట్రాన్సక్షన్స్ (లావాదేవీలు) ఇన్

GSTR-1, GSTR-2A, and GSTR-2B లో మీ లావాదేవీలను మీ సరఫరాదారుల లావాదేవీలతో సరిదిద్దే (రికాన్సిలియింగ్) అనుభవం మరింత సులభం అయింది . ఇది మీ పుస్తకాల్లోని సమాచారం జి.స్.టి పోర్టల్‌లోని సమాచారంతో సరిపోయిందా లేదా అని నిర్ధారిస్తుంది. అంతే కాకుండా, అన్‌రికన్సైల్డ్ లావాదేవీలలో జత అయ్యే అవకాశం ఉన్న లావాదేవీలను గుర్తించే సదుపాయం ద్వారా రికన్సిలియాషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది.

మీరు ఇప్పుడు:

  • JSON ఫైల్‌లో GSTR-1, GSTR-2A మరియు GSTR-2B ని దిగుమతి చేసుకోవచ్చు.
  • లావాదేవీలను రికన్సైల్ చేయండి:
    • జి.స్.టి  పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేయబడిన లావాదేవీలను దిగుమతి చేసుకున్న తర్వాత.
    • రిటర్న్ ఎఫెక్టివ్ తేదీని అప్‌డేట్ చేయడం ద్వారా లావాదేవీ వేరే రిటర్న్ పీరియడ్‌లో జరిగినప్పటికీ మీరు అలా చేయవచ్చు
    • అసమతుల్యత యొక్క పరిమితిని పేర్కొనడం ద్వారా.
    • GSTR 2A మరియు GSTR 2B డాక్యుమెంట్ నంబర్‌లోని అంకె ముందు వచ్చే సున్నాలు లేదా ప్రత్యేక అక్షరాల ఉపసర్గను విస్మరించడం ద్వారా.
    • GSTR 2A మరియు GSTR 2B రికన్సిలియాషన్ కోసం విస్మరించబడే డాక్యుమెంట్ నంబర్ లేదా ఇన్‌వాయిస్ నంబర్‌లో పార్టీ ఉపయోగించే ఉపసర్గను కాన్ఫిగర్ చేయడం ద్వారా.
  • అవసరమైన విధంగా లావాదేవీల స్థితిని రికన్సిలియాషన్ లేదా సరిపోలని మాన్యువల్‌గా గుర్తించండి.
  • GSTR 2A మరియు GSTR 2B లో  సప్లయర్ ఇన్‌వాయిస్ నంబర్ మరియు తేదీని డాక్యుమెంట్ నంబర్‌గా పరిగణించండి మరియు రికన్సిలియాషన్ కోసం తేదీ.
  • GSTR-2B లో ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లభ్యమవపోవడానికి గల  కారణాన్ని గుర్తించండి.

ఇంకా ఏమిటంటే, పోర్టల్‌లో జరిగే లావాదేవీల కోసం, పుస్తకాల్లో లేదా దానికి విరుద్ధంగా, సరిపోలే విలువలతో పాటు విభిన్న డాక్యుమెంట్ నంబర్‌లు, పార్టీ GSTIN/UINలు లేదా రిటర్న్‌లోని విభాగాలను గుర్తించడంలో ట్యాలీ ప్రైమ్ మీకు సహాయపడుతుంది. ఇది లావాదేవీలను వేగంగా పునరుద్దరించటానికి మీకు మరింత సహాయపడుతుంది.

దీనికి గురుంచి మరింత తెలుసుకోవడానికి రికన్సెయిల్ GSTR-1 డేటా, రికన్సెయిల్ GSTR-2A డేటా, మరియు రికన్సెయిల్ GSTR-2B డేటా  ను చూడండి.

రిపోర్ట్ ఫిల్టర్‌లతో వ్యాపార సమాచారానికి త్వరిత గతిన చూడండి

అవసరమైన సమాచారం మరియు డేటా విశ్లేషణను కనుగొనడం అనేది ఫిల్టర్‌లను వర్తింపజేయడానికి బహుముఖ సదుపాయంతో వేగంగా, సులభంగా మరియు సులువుగా మారింది:

  • సులభంగా కనుగొనవచ్చు
  • కేవలం ఒక క్లిక్‌తో యాక్సెస్ చేయవచ్చు
  • వ్యాపార దృశ్యాల శ్రేణిని కవర్ చేయడానికి మెరుగుపరచబడింది

నివేదికలో, మీరు ఇప్పుడు వీటిని చేయవచ్చు:

  • లావాదేవీ లేదా మాస్టర్‌లోని అన్ని ఫీల్డ్‌లు లేదా నిర్దిష్ట ఫీల్డ్‌లో అవసరమైన సమాచారం కోసం శోధించండి.

మీరు లావాదేవీలు మరియు మాస్టర్‌లలో అందుబాటులో ఉన్న పూర్తి స్థాయి ఫీల్డ్‌లలో శోధించవచ్చు:

    • జి.స్.టి వివరాలు, GSTIN/UIN, జి.స్.టి రేట్లు, HSN/SAC.
    • అనుబంధ వివరాలలోని  ఫీల్డ్స్
    • ఇ-వే బిల్లు మరియు ఇ-ఇన్‌వాయిస్ సంబంధిత ఫీల్డ్‌లు
  • అవసరమైన సమాచారం యొక్క నిర్దిష్టత మరియు సంక్లిష్టత ఆధారంగా కింది రకాల ఫిల్టర్‌ల నుండి ఎంచుకోండి:
    • ప్రాథమిక ఫిల్టర్, ఇది శీఘ్ర శోధన ఇంజిన్ వలె పనిచేస్తుంది.
    • మల్టీ-ఫిల్టర్, ఇది సమాచారాన్ని కనుగొనడానికి ఒకటి కంటే ఎక్కువ శోధన ప్రమాణాలను జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
    • అధునాతన ఫిల్టర్, ఇది మాస్టర్‌లు మరియు లావాదేవీలు రెండింటిలోనూ సమాచారాన్ని కనుగొనడానికి శోధన ప్రమాణాలను జోడించడంలో మీకు సహాయపడుతుంది.
  • నివేదికలో వర్తింపజేసిన ఫిల్టర్ గురించి తెలుసుకోవడానికి కేవలం ఒక క్లిక్‌లో ఫిల్టర్ వివరాలను వీక్షించండి.
  • మీ సంస్థలో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఏదైనా నివేదికలో వర్తించే డిఫాల్ట్ ఫిల్టర్‌ని ఎంచుకోండి.

ఇంకా ఏమిటంటే, మీరు ఫిల్టర్‌లను వర్తింపజేసిన నివేదిక యొక్క వీక్షణను సేవ్ చేయవచ్చు మరియు ఫిల్టర్ చేసిన సమాచారాన్ని త్వరగా చూడవచ్చు.

డబ్బు చెల్లించమని విన్నపము ( పేమెంట్ రిక్వెస్ట్ )

టాలీ ప్రైమ్  ఇప్పుడు చెల్లింపు అభ్యర్థన లక్షణంతో (ఫీచర్ ) వస్తుంది, ఇది చెల్లింపు లింక్స్ మరియు క్యూఆర్ కోడ్‌లను (చెల్లింపు గేట్‌వే లేదా UPI ఉపయోగించి) సులభంగా ఉత్పత్తి చేసి ఇంకొకరికి పంపిచండానికి  మీకు సహాయపడుతుంది. ఈ లక్షణం తో (ఫీచర్) మీరు సులభంగా మరియు తక్షణమే మీ యొక్క వినాయగదారులతో  చెల్లింపులను పూర్తి చేసుకోగలరు.

టాలీ ప్రైమ్  ఇప్పుడు చెల్లింపు అభ్యర్థన లక్షణంతో (ఫీచర్ ) వస్తుంది, ఇది చెల్లింపు లింక్స్ మరియు క్యూఆర్ కోడ్‌లను (చెల్లింపు గేట్‌వే లేదా UPI ఉపయోగించి) సులభంగా చిటిక లో  ఉత్పత్తి చేసి ఇంకొకరికి పంపిచండానికి  మీకు సహాయపడుతుంది. ఈ లక్షణం తో (ఫీచర్) మీరు సులభంగా మరియు తక్షణమే మీ యొక్క వినాయగదారులతో  చెల్లింపులను పూర్తి చేసుకోగలరు.

చెల్లింపు అభ్యర్థన క్రింది లక్షణాలు  కలిగి ఉంటుంది :

  • తక్షణ చెల్లింపు అభ్యర్థన:  మీరు మీ  టాలీ ప్రైమ్ ను  అమర్చిన తర్వాత చెల్లింపు లింక్‌లు మరియు క్యూఆర్ కోడ్‌లను తక్షణమే ఉత్పత్తి చేయడానికి మరియు ఇతరులకు పంపడానికి టాలీ ప్రైమ్ మీకు సహాయపడుతుంది. ఈ ప్రక్రియ అంతా మీ రోజు వారి వ్యాపారంలో భాగంగానే జరుగుతుంది.
  •  అంతరాయం లేని రికన్సిలియాషన్:  టాలీ ప్రైమ్  ఇప్పుడు మీరు అత్యంత శులభంగా మీ యొక్క చెలింపుల  అభ్యర్ధన ను  రికన్సెయిల్ చేసుకోవచ్చు.

పేమెంట్ రికన్సిలియాషన్ రిపోర్ట్  ఇపుడు మీకు మీ మొత్తం రికంసైల్డ్ మరియు అన్ రికంసైల్డ్ లావాదేవీల సారాంశం నివేదికను  అందింస్తుంది.

  • డేటా సెక్యూరిటీ:  మీ ఆర్థిక డేటా యొక్క భద్రత మీ వ్యాపారానికి చాలా ముఖ్యమని మేము అర్థం చేసుకున్నాము మరియు మీ డేటా ఖచ్చితంగా సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి మేము చాలా చర్యలు తీసుకున్నాము. 

మీకు ఉత్తమమైన భద్రతా విధానాలను అందించడానికి మేము ప్రముఖ చెల్లింపు గేట్‌వేలతో భాగస్వామ్యం చేసుకున్నాము , మరియు మీ చెల్లింపులు సురక్షితమైన చేతుల్లో ఉన్నాయని మీకు మేము  హామీ ఇస్తున్నాము. 

దీనికి గురుంచి మరింత తెలుసుకోవడానికి పేమెంట్ రిక్వెస్ట్ ఇన్ టాలీ ప్రైమ్ ను చూడండి.

మెరుగైన డేటా నిర్వహణ అనుభవం పొందండి

మెరుగైన డేటా మేనేజ్‌మెంట్ సౌకర్యాలు ఇప్పుడు మీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా కొత్త రిలీజ్ కు మైగ్రేషన్ అయ్యేలా చూడడమే కాకుండా రిపేర్ (మరమ్మత్తు), దిగుమతి మరియు సింక్రొనైజేషన్‌లో మెరుగైన సరళతతో అందిస్తుంది.మీరు కార్యాచరణ పురోగతిని కూడా వివరంగా వీక్షించవచ్చు మరియు మినహాయింపులు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించవచ్చు.

మెరుగైన మైగ్రేషన్ మరియు మరమ్మత్తు అనుభవం.

మైగ్రేషన్ మరియు రిపేర్ యొక్క స్థితి

కంపెనీకి ఎదురుగా  ఉన్న స్థితి కంపెనీని తరలించాలా లేదా మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉంటే వెంటనే మీకు తెలియజేస్తుంది.

మైగ్రేషన్ మరియు మరమ్మత్తు యొక్క పురోగతి

మాస్టర్‌లు మరియు లావాదేవీల ధృవీకరణ నుండి మీ డేటా యొక్క విజయవంతమైన మైగ్రేషన్ లేదా రిపేర్ వరకు, మెరుగుపరచబడిన ప్రక్రియ మిమ్మల్ని పురోగతికి కంటే ముందు ఉంచుతుంది.  

మైగ్రేషన్ మరియు మరమ్మత్తు సారాంశాన్ని వీక్షించండి

డేటా మైగ్రేషన్ లేదా మరమ్మత్తు ముగింపులో, మీరు ప్రక్రియ పూర్తయ్యే ముందు మరియు తర్వాత మొత్తం వోచర్‌లు మరియు మాస్టర్‌లతో కూడిన సారాంశాన్ని చూడవచ్చు.

ప్రక్రియ సమయంలో డేటా నష్టం జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.

ప్రక్రియ సమయంలో సంభవించిన లోపాలను వీక్షించండి మరియు పరిష్కరించండి

మైగ్రేషన్, రిపేర్, దిగుమతి లేదా సింక్రొనైజేషన్ ముగింపులో, మీరు సులభంగా:

  • ప్రక్రియ సమయంలో సంభవించిన మినహాయింపులను గుర్తించండి.
  • వర్తించే విధంగా, ఒకేసారి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మినహాయింపులను పరిష్కరించండి.

అంతేకాదు, మీ సౌలభ్యం ప్రకారం ప్రక్రియ ముగింపులో లేదా తర్వాత మినహాయింపులను పరిష్కరించడానికి మీకు సౌలభ్యం ఉంది

GSTN డేటాను రీసెట్ చేయండి

మీరు దిగుమతి చేసుకున్న GSTN డేటా పాడైపోయినప్పుడు లేదా డేటా అనుకోకుండా దిగుమతి అయినప్పుడు, అది రికన్సిలియాషన్ సమస్యలను కలిగిస్తుంది.

అయితే, ట్యాలీ ప్రైమ్ ఇప్పుడు దిగుమతి చేసుకున్న GSTN డేటాను రీసెట్ చేసే సదుపాయాన్ని మీకు అందిస్తుంది, ఇది మీ బుక్ డేటాను అలాగే ఉంచుతూనే పాడైన GSTN డేటాను తొలగిస్తుంది.

ఆ తర్వాత, మీరు పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసిన GSTR-1 లేదా GSTR-2A యొక్క JSON ఫైల్‌ని మళ్లీ దిగుమతి చేసుకోవచ్చు మరియు మీ లావాదేవీల రికన్సైల్ కొనసాగించవచ్చు.

ఒకే స్క్రీన్‌పై బహుళ కంపెనీలను కనెక్ట్ చేయండి లేదా డిస్‌కనెక్ట్ చేయండి

మీరు ఇప్పుడు ఒకే స్క్రీన్‌ని ఉపయోగించి ఆన్‌లైన్ యాక్సెస్ కోసం బహుళ కంపెనీలను కనెక్ట్ చేయవచ్చు లేదా డిస్‌కనెక్ట్ చేయవచ్చు, తద్వారా కంపెనీలను ఒక్కొక్కటిగా ఎంచుకోవడంలో వినియోగించే సమయం ఆదా అవుతుంది.

రిమోట్ వర్కింగ్, సింక్రొనైజేషన్ లేదా బ్రౌజర్ యాక్సెస్ కోసం మీరు ఆన్‌లైన్‌కి కనెక్ట్ చేయాల్సిన బహుళ కంపెనీలను కలిగి ఉన్న వ్యాపారాలకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

ప్రోడక్ట్ లో మెరుగుదలలు – ట్యాలీ ప్రైమ్ రిలీజ్ 3.0 

కొనుగోలు వోచర్లలో టాక్స్ ఎనాలిసిస్ (విశ్లేషణ) (కాంపోజిషన్ డీలర్లకు) 

కాంపోజిషన్ డీలర్లకు కొనుగోలు వోచర్లలో టాక్స్ ఎనాలిసిస్ (విశ్లేషణ) సౌలభ్యం ఇప్పుడు అందుబాటులోకి తేబడినది. 

ఆటోమేటిక్ (మాన్యువల్ ఓవర్‌రైడ్) కోసం చివరి వోచర్ సంఖ్యను  (నంబర్‌ను) మార్చడం

ఆటోమేటిక్ (మాన్యువల్ ఓవర్‌రైడ్) వోచర్ నంబరింగ్ పద్ధతి విషయంలో, మీరు వోచర్‌ను ఆప్షనల్  (ఐచ్ఛికం) చేసినప్పుడు లేదా తొలగించినప్పుడు, తదుపరి వోచర్‌లు ఐచ్ఛికం లేదా తొలగించబడిన వోచర్ యొక్క వోచర్ నంబర్ ప్రకారం నంబర్ చేయబడ్డాయి.

మీరు ఇప్పుడు సులభంగా నంబరింగ్ వివరాలను సెట్ చేయవచ్చు లేదా మార్చవచ్చు మరియు చివరిగా నమోదు చేసిన వోచర్ నంబర్‌ను మార్చవచ్చు, తద్వారా భవిష్యత్ వోచర్‌లు తదనుగుణంగా లెక్కించబడతాయి.

డూప్లికేట్ వోచర్ మరియు సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ కల వోచర్లు ను గుర్తించటం 

ఇప్పుడు అన్ని డూప్లికేట్ వోచర్లు మరియు సప్లయర్ ఇన్వాయిస్ నంబర్లు కల  వోచర్లు ను డూప్లికేట్ వోచర్ నెంబర్ లోని అన్సర్టైన్ ట్రాన్సక్షన్స్ (కర్క్ క్షన్  నీడెడ్)  లోని విభాగం లో గుర్తించవచ్చు. 

ఇప్పుడు మీరు రిటర్న్ లు  ఫైల్ చేసే ముందు అవసరమైన మార్పుచేర్పులు  చేయవచ్చు.

వోచర్ నంబర్ మరియు రెఫరెన్స్ నంబర్‌లో మార్పు.

మీరు వోచర్ తేదీని మార్చినప్పుడు, వోచర్ నంబర్ మరియు రెఫరెన్స్ నంబర్ కూడా మార్చబడతాయి.

మీ వోచర్ నంబరింగ్ విధానం ఆటోమేటిక్ లేదా మల్టీ-యూజర్ ఆటో అయినప్పుడు మీరు ఇప్పుడు వోచర్ నంబర్‌లను ఉంచుకునే సదుపాయాన్ని కలిగి ఉన్నారు.

అన్ రిజిస్టర్డ్ డీలర్స్ కోసం బయానా (అడ్వాన్సు) రసీదుని ట్రాక్ చేయడం

GSTR-1 మరియు GSR-3B, అన్ రిజిస్టర్డ్రు డీలర్స్ లేదా వినియోగదారులు నుండి  బయానా (అడ్వాన్స్) రసీదును ట్రాక్  చెయ్యలేకపోడం.

ఈ సమస్య  ఇప్పుడు  పరిష్కరించబడింది.

నిర్దిష్ట కొనుగోలు వోచర్లల ప్లేస్ అఫ్ సప్లై 

మీరు ఇప్పుడు కొనుగోలు వోచర్‌లలో దీని కోసం రికార్డ్ చేయబడిన వాటి వంటి ప్లేస్ అఫ్ సప్లై  జోడించవచ్చు:

  • స్థానికంగా సేవలను పొందే అంతర్రాష్ట్ర పార్టీ (ఇంటర్ స్టేట్ ).
  • స్థానికంగా వస్తువులను కొనుగోలు చేసి, వారి స్థానానికి రవాణా చేసే అంతర్రాష్ట్ర పార్టీ (ఇంటర్ స్టేట్ ).

గత కాలం లో  సేల్స్ కొరకు తీసుకున్న బయానా (అడ్వాన్స్) 

గత కాలం లో  సేల్స్ కొరకు తీసుకున్న బయానా (అడ్వాన్స్)  GSTR-1 మరియు GSTR-3B లో కనిపించకపోవడం.

ఈ సమస్య ఇప్పుడు  పరిష్కరించబడింది.

చెల్లుబాటు అవుతున్న GSTIN కూడా చెల్లదు అని చూపించుట

కొన్ని చెల్లుబాటు GSTIN అవుతున్న కూడా చెల్లదు అని చూపించడం.

ఈ  ఇప్పుడు సమస్య పరిష్కరించబడింది.

ప్లేస్ అఫ్ సప్లై మారినప్పుడు  పర్చేస్ వోచర్ లో జి.స్.టి ని లెక్కించడం

పర్చేస్ వోచర్ లో మీరు ప్లేస్ అఫ్ సప్లైని  పార్టీ డీటెయిల్స్ స్క్రీన్  లో మార్చినా కూడా, జి.స్.టి  రాష్ట్రంని ఆధారంగ  తీస్కుని లెకించబడుతుంది.

ఇక ఇప్పటి నుంచి జి.స్.టి, వోచర్ లో  పేర్కొన్న ప్లేస్ అఫ్ సప్లైని  ఆధారంగ లెకించబడుతుంది.

సేల్స్ ఇన్వాయిస్ మార్పులలో  పార్టీ డీటెయిల్స్ (వివరాలు)

మీరు సేల్స్ ఇన్వాయిస్ ను  మరియు పార్టీ లెడ్జెర్ ను కాష్ కు మార్చినప్పుడు, పార్టీ ని రిజిస్ట్రేషన్ టైపు ను అన్ రిజిస్టర్డ్ కు మార్చిన్నపుడు మరియు పార్టీ డీటెయిల్స్ లో GSTIN/UIN తీసివేయబడుదుతోంది.  

ఇప్పట్నుంచి పార్టీ లెడ్జెర్ మార్చినప్పుడు,  మీరు ఇంతకముందు లెడ్జెర్ లో  ఉన్న వివరాలనే  ఉంచుకోవచ్చు లేదా  కొత్త వివరాలను నమోదు చెయ్యవచు.

సేల్స్ ఇన్వాయిస్ మార్పులలో  పార్టీ డీటెయిల్స్ (వివరాలు)

మీరు సేల్స్ ఇన్వాయిస్ ను  మరియు పార్టీ లెడ్జెర్ ను కాష్ కు మార్చినప్పుడు, పార్టీ ని రిజిస్ట్రేషన్ టైపు ను అన్ రిజిస్టర్డ్ కు మార్చిన్నపుడు మరియు పార్టీ డీటెయిల్స్ లో GSTIN/UIN తీసివేయబడుదుతోంది.  

ఇప్పట్నుంచి పార్టీ లెడ్జెర్ మార్చినప్పుడు,  మీరు ఇంతకముందు లెడ్జెర్ లో  ఉన్న వివరాలనే  ఉంచుకోవచ్చు లేదా  కొత్త వివరాలను నమోదు చెయ్యవచు.

బహుళ-కరెన్సీ వోచర్‌ల కోసం పన్ను విశ్లేషణ మరియు ప్రింట్ ప్రివ్యూలో CGST మరియు SGST

మీరు బహుళ కరెన్సీతో విక్రయాల ఇన్‌వాయిస్‌ను రికార్డ్ చేసినప్పుడు, టాక్స్ ఎనాలిసిస్  ప్రదర్శించబడిన CGST మరియు SGST ప్రింట్ ప్రివ్యూలో కనిపించలేదు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

ప్రొవిజిన్స్ లో  సృష్టించబడిన లెడ్జర్‌ల కోసం కొనుగోలు-సంబంధిత లావాదేవీల స్వభావాలు అందుబాటులో లేవు

ప్రొవిజిన్స్ లో సృష్టించబడిన లెడ్జర్‌ల కోసం, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల స్వభావాలు అందుబాటులో లేవు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-3Bలో ITC కి అర్హత లేని వస్తువుల RCM కొనుగోళ్లు

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కి అర్హత లేని వస్తువుల RCM కొనుగోళ్లు Dలో కనిపించలేదు. GSTR-3B యొక్క ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విభాగానికి అర్హత లేదు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

కంపోజిషన్ డీలర్ల కోసం స్టాక్ గ్రూప్‌లో జి.స్.టి వివరాలను ఒక నిర్దిష్ట రూపంలోకి తీసుకురావడం  (కాన్ఫిగర్) చేస్తోంది.

కంపోజిషన్ డీలర్లు ఇప్పుడు స్టాక్ గ్రూప్‌లో GST వివరాలను కాన్ఫిగర్ చేయవచ్చు.

ఇది స్టాక్ గ్రూప్ కింద సాధారణ GST రేటుతో బహుళ స్టాక్ వస్తువులను సమూహపరచడానికి మరియు GST వివరాలను అందించడానికి సహాయపడుతుంది.

కంపోజిషన్ డీలర్ల కోసం స్టాక్ ఐటమ్‌లో MRP రేటును పేర్కొనడం

కంపోజిషన్ డీలర్లు ఇప్పుడు స్టాక్ ఐటమ్‌లో MRP రేటును పేర్కొనవచ్చు.

వోచర్ రకాన్ని  ఉపయోగించి డిస్కౌంట్ నమోదు చేయబడిన ఇన్‌వాయిస్‌లలో తప్పు SGST మరియు CGST గణన

వోచర్ రకాన్ని ఉపయోగించి డిస్కౌంట్ వర్తింపజేసినప్పుడు SGST మరియు CGST సేల్స్ ఇన్‌వాయిస్‌లలో తప్పుగా లెక్కించబడ్డాయి.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

జి.స్.టి రిటర్న్‌లలో చేర్చబడని ప్రైమరీ గ్రూప్ లో సృష్టించబడిన లెడ్జర్‌లతో కూడిన వోచర్‌లు

నిర్దిష్ట లెడ్జర్‌లతో కూడిన వోచర్‌లు ఏ జి.స్.టి రిటర్న్‌లో చేర్చబడలేదు.

వోచర్‌లు ప్రైమరీ గ్రూప్ కింద రూపొందించబడిన లెడ్జర్‌ను కలిగి ఉన్నప్పుడు, సమూహం యొక్క స్వభావం ఆదాయం/ఖర్చుగా రూపొందించబడినప్పుడు ఇది జరిగింది.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

రిమోట్ ఎండ్‌లో ఉన్నసంస్థ లో సేల్స్ ఇన్‌వాయిస్‌లో జి.స్.టి/ఇ-వే బిల్లు వివరాలు

మీరు రిమోట్ యాక్సెస్ ద్వారా కనెక్ట్ చేయబడిన కంపెనీలో పనిచేసినప్పుడు సేల్స్ ఇన్‌వాయిస్‌లో జి.స్.టి/e-వే బిల్లు వివరాలను అందించే సౌకర్యం (ఆప్షన్) అందుబాటులో లేదు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-1లో మెరుగుదలలు

GSTR-1 యొక్క  డాక్యుమెంట్ సమ్మరీ లో డెబిట్ నోట్ 

డాక్యుమెంట్ సమ్మరీ లో డెబిట్ నోట్  రెండు సార్లు కనిపించుట 

మీరు డెబిట్ నోట్ రికార్డు (నమోదు) చేసినప్పుడు అది రెండు సార్లు డాక్యుమెంట్ సమ్మరీ లో రెండు సార్లు కనిపిస్తుంది – ఒకటి ఇంవోఇస్ష్ ఔట్వేర్డ్ సప్లై మరియు డెబిట్ నోట్ క్రింద.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది, ఇప్పట్నుంచి అది డెబిట్ నోట్ క్రింద మాత్రమే కనిపిస్తుంది. 

GSTR-1 యొక్క  డాక్యుమెంట్ సమ్మరీ లో డెబిట్ నోట్ 

డాక్యుమెంట్ సమ్మరీ లో డెబిట్ నోట్  రెండు సార్లు కనిపించుట 

మీరు డెబిట్ నోట్ రికార్డు (నమోదు) చేసినప్పుడు అది రెండు సార్లు డాక్యుమెంట్ సమ్మరీ లో రెండు సార్లు కనిపిస్తుంది – ఒకటి ఇంవోఇస్ష్ ఔట్వేర్డ్ సప్లై మరియు డెబిట్ నోట్ క్రింద.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది, ఇప్పట్నుంచి అది డెబిట్ నోట్ క్రింద మాత్రమే కనిపిస్తుంది. 

వివిధ చిరునామాలు కలిగిన పార్టీ కొరకు సేల్స్ ఇన్వాయిసెస్ 

ఆల్టరేషన్ (మార్పు) తర్వాత,  కొన్ని సేల్స్ ఇన్వాయిసెస్ GSTR-1 లో  B2B ఇన్వాయిసెస్ to B2C ఇన్వాయిసెస్ మారుతున్నాయి. 

మీరు ఎప్పుడైతే పార్టీ లెడ్జెర్ లో ఇంకొక చిరునామా నమోదు చేసిన తరువాత ఇన్వాయిస్ ని మారుస్తారో, దాని వల్ల  పార్టీ  రిజిస్ట్రేషన్ టైపు  అన్ రిజిస్టర్డ్ గా మారిపోతుంది, అప్పుడు ఇది జరుగుతుంది.  

ఈ సమస్య ఇప్పుడు  పరిష్కరించబడింది.

GSTR-1లో సరిపోలని బహుళ ఇన్‌వాయిస్‌ల ఎంపిక

మీరు GSTR-1 యొక్క ఆన్సర్టైన్ ట్రాన్సక్షన్స్ (కర్రెక్షన్స్ నీడెడ్) నుండి వోచర్ సెక్షన్ లో నేచర్ అఫ్ ట్రాన్సాక్షన్ (లావాదేవీ స్వభావం), టాక్సబుల్ వేల్యూ (పన్ను పరిధిలోకి వచ్చే విలువ), టాక్స్ రేట్ ను పరిశీలించినప్పుడు, మీరు పరిష్కరించడానికి లేదా అంగీకరించడానికి బహుళ ఇన్‌వాయిస్‌లను ఎంచుకోలేరు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-1 యొక్క ఎగుమతి చేయబడిన MS Excel ఫైల్‌లో దాద్రా మరియు నగర్ హవేలీకి సంబంధించిన రాష్ట్ర కోడ్

మీరు GSTR-1ని MS Excel ఫైల్‌గా ఎగుమతి చేసినప్పుడు దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూలకు సంబంధించిన స్టేట్ కోడ్ అందుబాటులో లేదు.

ఇది నమోదుకాని డీలర్లు లేదా ఇ-కామర్స్ ఆపరేటర్ కోసం రికార్డ్ చేయబడిన B2C ఇన్‌వాయిస్‌లలో జరిగింది.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-3Bలో మెరుగుదలలు

మూలధన వస్తువుల (కాపిటల్ గూడ్స్ ) దిగుమతి

మూలధన వస్తువుల (కాపిటల్ గూడ్స్) దిగుమతి కోసం రికార్డు చేయబడిన ట్రాన్సక్షన్స్ (లావాదేవీలు) వస్తువుల ఇంపోర్ట్ గూడ్స్ విభాగంలో  కనిపించలేదు.

అలాంటి ట్రాన్సక్షన్స్ (లావాదేవీలు) “నో డైరెక్ట్ ఇంప్లికేషన్స్ ఇన్ రిటర్న్” టేబుల్స్ లో కనిపిస్తాయి.

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది.

అదే / ఒకటే నెలలోని ఆర్.సి.యమ్ పర్చేస్ కోసం స్టాట్ అడ్జ్స్ట్మెంట్ వోచర్ యొక్క టాక్సబుల్ అమౌంట్ (మొత్తం పన్ను) 

GSTR-3B లోని 3.1 (d) ఇన్వార్డ్ సప్లైస్ (లయబుల్ టు రివర్స్ ఛార్జ్ ) విభాగం క్రింద  టాక్సబుల్ అమౌంట్ (మొత్తం పన్ను) కనిపించలేదు.

ఇది ఎప్పుడు జరిగుతుది అంటే,మీరు కనుక  ఆర్.సి.యమ్ పర్చేస్ వోచర్ రికార్డు చేసిన నెలలోనే  జర్నల్ వోచర్ ను ఇంక్రీజ్ అఫ్ టాక్స్ లయబిలిటి మరియు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ కూడా రికార్డు చేసినప్పుడు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-3B లో అన్సర్టైన్ ట్రాన్సక్షన్స్

ఇప్పటి నుంచి GSTR-1 మరియు GSTR-2A తో పాటు GSTR-3B  లో కూడా సేల్స్ మరియు పర్చేస్ యొక్క  అన్సర్టైన్ ట్రాన్సక్షన్స్  కనిపిస్తాయి.

GSTR-3B లో ఆర్.సి.యమ్ పర్చేస్ మీద జి.స్.టి కనిపించకపోవడం

GSTR-3B లోని ఆర్.సి.యమ్ పర్చేస్ మరియు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ కొరకు రికార్డు చేయబడిన లయబిలిటి కనిపించకపోవడం.

ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు  ఏదయిన ఒక పర్చేస్ యొక్క  ఆర్.సి.యమ్ లయబిలిటి మరియు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ కోసం అదే నెలలో  ఆర్.సి.యమ్ పర్చేస్ వోచర్  రికార్డు చేసినప్పుడు.

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది.

రిటర్న్ రిపోర్ట్స్ లో  పర్చేస్ యొక్క నెగటివ్ వాల్యూని సంభాళించడం

ఎప్పుడయితే మీరు  నెగటివ్ సేల్స్ లేదా పర్చేస్ వాల్యూ తో ఉన్న  JSON ఫైల్ ను జి.స్.టి పోర్టల్ లో అప్లోడ్ చేస్తారో  అప్పుడు అది ఎర్రర్ ని చూపిస్తుంది. 

అయితే  ఇప్పటి నుంచి, ఇక మీరు అటువంటి లావాదేవీలను (ట్రాన్సక్షన్స్ ), కొత్తగా తీసుకువచ్చిన రిటర్న్ ఎఫెక్టివ్ డేట్ అనే సౌలభ్యం ఉపయోగించుకుని వేరొక రిటర్న్ పీరియడ్ కు మార్చుకోవచ్చు. దీని ద్వారా  సేల్స్ లేదా  వాల్యూ  కచ్చితంగా యే ఒక్క రిటర్న్ పీరియడ్ లో  నెగటీవ్ చుపించకుండా చేసుకోవచ్చు.

ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC)  రివెర్స్డ్  క్రింద రిక్లైమ్ అఫ్ రివెర్సల్ అఫ్  ITC కనిచిపకపోవడం

అథర్స్ క్రింద ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC)  రివెర్స్డ్ విభాగం లో రిక్లైమ్ అఫ్ రివెర్సల్ అఫ్  ITC  కోసం  కోసం  రికార్డు చేయబడిన ట్రాన్సక్షన్స్ కనిపించకపోవడం.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

ఎగ్జమ్ప్టెడ్ / నిల్ రేటెడ్ మరియు టాక్సబుల్ ఐటమ్స్ యొక్క ఇన్వాయిస్ లో  ఎర్రర్ 

GSTR-3B ఫైల్ చేస్తున్నప్పుడు, మీరు  టాక్సబుల్ ఐటమ్స్ తో పాటు  ఎగ్జమ్ప్ట్  / నిల్ రేటెడ్ ఐటమ్స్ కలిగిన  ఇన్వాయిస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు, ఈ క్రింది చూపిం విధంగా  ఎర్రర్ వచ్చి ఉండొచ్చు:

ఈ సమస్య ఇప్పుడు  పరిష్కరించబడింది.

తక్కువ సమయంలో GSTR-3Bలో ఉన్నట్లుగా వోచర్‌లను సరిదిద్దడం మరియు ఆమోదించడం

GSTR-3Bలో, వోచర్‌లను సరిదిద్దడానికి మరియు ఆమోదించడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది, ముఖ్యంగా ఆన్సర్టైన్ ట్రాన్సక్షన్స్ (అనిశ్చిత లావాదేవీ) లకు నావిగేట్ చేస్తున్నప్పుడు (కరెక్షన్‌లు అవసరం).

వోచర్‌లను సరిచేయడానికి మరియు పరిష్కరించడానికి ఇప్పుడు చాలా తక్కువ సమయం పడుతుంది.

డైరెక్ట్ ఎక్సపెన్స్ సంబంధించిన లావాదేవీలు GSTR-3Bలో చేర్చబడలేదు

డైరెక్ట్ ఎక్సపెన్స్  గ్రూప్ తో (సమూహంతో) కూడిన లావాదేవీలు GSTR-3Bకి సంబంధించినవి కావు. అవి ఇప్పుడు రిటర్న్‌లో చేర్చబడుతున్నాయి.

GSTR-2A సయోధ్యలో మెరుగుదలలు రికన్సిలియాషన్  

కరెంట్ లైబిలిటీస్ క్రింద సృష్టించబడిన లెడ్జర్‌లతో వోచర్‌ల రికన్సిలియాషన్  

లావాదేవీలోని అన్ని విలువలు పోర్టల్ డేటాతో సరిపోలినప్పటికీ, కొన్ని లావాదేవీలు తమంతట తాముగా రికన్సైల్  అవ్వవు. కరెంట్ లైబిలిటీస్ క్రింద సృష్టించబడిన పార్టీ లెడ్జర్‌లతో లావాదేవీలకు ఇది జరిగింది.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

రికన్సిలియాషన్  కోసం జి.స్.టి స్థితిని (స్టేటస్ ) మాన్యువల్‌గా సెట్ చేయడం

GSTR-2Aలో, దిగుమతి చేసుకున్న లావాదేవీలు మాన్యువల్‌గా రికన్సైల్ అయినట్టు గుర్తించబడవు.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది, జి.స్.టి స్థితిని సెట్ చేసే సదుపాయం ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది.

ఏ కాలపరిమితికి చెందిన లావాదేవీలైనా ఇప్పుడు పోల్చిచూడవచ్చు

ట్యాలీ ప్రైమ్ లో ఇప్పుడు  ఏ కాలపరిమితికి చెందిన వోచర్లనయినా GSTR-2A లో  రికన్సిలియాషన్  చేయవచ్చు.

ప్రస్తుత రిటర్న్‌లోని  గత ఆర్థిక సంవత్సరపు  కొనుగోలు వోచరు 

గత ఆర్థిక సంవత్సర కొనుగోలు వోచర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు GSTR-2A రికన్సిలియాషన్ లో(సమన్వయపట్టిక) చూపబడ్డాయు  .

మీరు గత సంవత్సరంలో ఉపయోగించిన సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు తిరిగి ప్రస్తుత సంవత్సరంలో అదే ఖాతా (పార్టీ) కు ఉపయోగించినప్పుడు, ఇలా జరుగుతుంది.

 ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-2A యొక్క నిల్ రేటెడ్ లావాదేవీలను తక్కువ సమయంలో తిరిగి ఆదా చేయడం

GSTR-2Aలో, నిల్ రేటెడ్ స్టాక్ ఐటమ్స్  (వస్తువులు) లేదా లెడ్జర్‌లతో లావాదేవీల కోసం రీ-సేవింగ్ వోచర్‌లు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది.

అలా చేయడానికి ఇప్పుడు గణనీయంగా తక్కువ సమయం పడుతుంది.

GSTR-4లో మెరుగుదలలు

GSTR-4 లో సేల్స్ ఇన్వాయిస్ 

GSTR-4 లో సేల్స్ ఇన్వాయిస్, ఇంక్లూడెడ్  ఇన్ రిటర్న్ మరియు నాట్ రెలెవన్ట్ ఫర్ థిస్ రిటర్న్  అని రెండు విభాగాలలోను కనిపిస్తోంది.

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది.

GSTR-4లో చేర్చని నమోదు చేయని పార్టీల నుండి RCM కొనుగోళ్లు

నమోదు చేయని పార్టీ కోసం నమోదు చేయబడిన RCM కొనుగోలు లావాదేవీలు GSTR-4కి సంబంధించినవి కావు. అవి ఇప్పుడు రిటర్న్‌లో చేర్చబడుతున్నాయి.

GSTR-4 యొక్క 4A&B (B2) వర్క్‌షీట్‌లో  ( పని  నిర్వాహణ పత్రం) సరైన ప్లేస్ అఫ్ సప్లై 

మీరు జి.స్.టి విభాగం అందించిన MS Excel నమూనా  (టెంప్లేట్‌లో) GSTR-4ని ఎగుమతి చేసినప్పుడు, 4A&B (B2B) పని  నిర్వాహణ పత్రంలో (వర్క్‌షీట్‌లో) ప్లేస్ అఫ్ సప్లై తప్పుగా ఉంది.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

ఇ-వే బిల్లు కోసం లావాదేవీల ను మినహాయించడం.

ఇ-వే బిల్లు యొక్క వినియోగదారు మినహాయించబడిన లావాదేవీలు ఇ-ఇన్‌వాయిసింగ్ నుండి మినహాయించబడ్డాయి.

కొన్ని వోచర్‌లు ఇ-ఇన్‌వాయిస్ నుండి మినహాయించబడతాయి.

ఇది ఇ-వే బిల్ నివేదికలోని యూజర్ ఎక్సక్లూడ్డ్ ట్రాన్సక్షన్స్ (నాట్ రెలెవన్ట్) క్రింద వోచర్‌లకు జరిగింది.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.

ఇ-వే బిల్ నివేదిక నుండి బహుళ లావాదేవీలను మినహాయించడానికి పాక్షిక విభాగం

ఇ-వే బిల్లు నివేదికలో, మీరు మిస్సింగ్/ఇన్వాలిడ్ ఇన్ఫర్మేషన్ (కనిపించని/చెల్లని సమాచారం)  విభాగంలో ఎంచుకున్న ఇన్‌వాయిస్‌లన్నింటినీ మినహాయించలేరు.

ఇది ఒకేసారి మినహాయించాల్సిన ఇన్‌వాయిస్‌లు చాలా ఉన్నప్పుడు  జరిగింది.

ఈ సమస్య  ఇప్పుడు పరిష్కరించబడింది.,మీరు ఇప్పుడు ఇ-వే బిల్ నివేదిక నుండి మినహాయించటానికి అనేక ఇన్‌వాయిస్‌లను ఎంచుకోవచ్చు.

డిలీట్ (తీసివేసిన) వోచర్ ను మాడిఫైడ్ (సవిరించిన) వోచర్ గా చూపించడం 

e-ఇన్వాయిస్ రిపోర్ట్ లోని వోచర్ ఇన్ఫర్మేషన్ మిస్మ్యాచ్ విత్  కోడ్ లో డిలీట్డ్ (తీసివేయబడిన) వోచర్లు మాడిఫైడ్ (మార్చినట్టు) గా కనిపిస్తున్నాయి, అంతే కాకుండా వోచర్ డేట్ మరియు  e-ఇన్వాయిస్ వివరాలు కూడా కనిపించడం లేదు.    

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది, కాబట్టి డిలీట్డ్ వోచర్లు (తీసివెయ్యబడిన) డిలీట్డ్ గా నే కనిపిస్తాయి మరియు  e-ఇన్వాయిస్ వివరాలు కూడా అలాగే ఉంటాయి.

డేటా స్ప్లిట్  (భాగాలుగా విడగొట్టుట) చేస్తున్నప్పుడు MAV ఎర్రర్ 

కొన్ని సంథర్భాలలో,   డేటా స్ప్లిట్ ని  Memory Access Violation (MAV) ఎర్రర్  జరగకుండా అడ్డుపడుతుంది. 

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది.

TallyHelpwhatsAppbanner
Is this information useful?
YesNo
Helpful?
/* */