Explore Categories

 

 PDF

TallyPrime Release 2.1 మరియు TallyPrime Edit Log Release 2.1 లకు రిలీజ్ నోట్సు | క్రొత్తగా వచ్చినవేవి తెలుసుకోండి

మీ TallyPrime ప్రయాణం సంతోషకరంగా ఉంచటం మా బాధ్యత – అందుకేసం మేము నిరంతరం ప్రోడక్టులో క్రొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాము, ఉదాహరణకు మీ కంపనీ డేటా పై మీకు మరింత పట్టునివ్వటానికి మాష్టర్లు మరియు వోచర్లలో జరపబడిన వివిధ మార్పుచేర్పుల జాడను మీకు తెలియపరిచే ఎడిట్ లాగ్ ఫీచర్. 

Release 2.1 తో మీకు క్రింద తెలిపిన ప్రోడక్టులలో ఏదయినా ఎంచుకునే వీలు కల్పించాము:

  • TallyPrime Edit Log: ఆర్థిక నియంత్రణ కొరకు, మీ వ్యాపార సంబంధ అన్ని వ్యవహారలను మీకు ట్రాక్ చేయవలసిన అవసరం ఉన్నట్లయితే, లేదా, Ministry of Corporate Affairs (MCA), ద్వారా 1st April 2022 నుండి తప్పనిసరి చేయబడిన ఆడిట్ ట్రయల్ వంటి  చట్టబద్ధ అవసరం మీకు ఉన్నట్లయితే, ఇది ఎంచుకోండి. ఈ ప్రోడక్టులో ఎడిట్ లాగ్ తీసివేసే లేదా నిష్క్రియం చేసే వీలు లేదు.
  • TallyPrime: అంతర్గత ఆడిట్ ప్రయోజనాల కొరకు, లేదా అప్పుడప్పుడు లాగ్ చూడటానికి, మీ దైనందిక వ్యాపార వ్యవహారలలో ఎడిట్ లాగ్ సౌలభ్యాన్ని మీరు ఎంచుకోవచ్చు. ట్యాలీ ప్రైమ్ స్వతంత్రంగా ఈ కార్యకలాపాలను లేదా మాష్టర్లలో కానీ వోచర్లలో కానీ జరిగిన మార్పుచేర్పులను ట్రాక్ చేయదు. కేవలం మీరు అవసరం అనుకున్నప్పుడు మాత్రమే, ఎడిట్ లాగ్ క్రియం లేదా  నిష్క్రియం చేసుకోవచ్చు.

ఇంకా, డిజిటల్ సిగ్నేచరు సౌలభ్యం, అతి సులభంగా మీ డాక్యుమెంట్ల పై డిజిటల్ గా సంతకం జోడించి, ప్రమాణీకరించే వీలు కల్పిస్తుంది. ఆ పై మీరు వీటిని సంబంధిత వ్యక్తులకు

సురక్షితంగా పంపవచ్చు.

ముఖ్యాంశాలు – TallyPrime మరియు TallyPrime Edit Log Release 2.1

ఎడిట్ లాగ్ యొక్క లభ్యత

ట్యాలీ ప్రైమ్ లోని ఎడిట్ లాగ్ మీకు మీ ఆర్ధిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది,  దీనితో, వోచర్లలో మరియు మాష్టర్లలో జరిగిన మార్పుచేర్పులు మరియి ఇతర కార్యకలాపాలపై మీరు పట్టు సాధించవచ్చు.

ట్యాలీ ప్రైమ్ లోని ఎడిట్ లాగ్ తో మీరు: 

  • క్రింద పేర్కొన్న వివిధ కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు :
    • అన్ని వోచర్లు 
    • మాష్టర్లు: స్టాక్ ఐటం, లెడ్జర్లు మరియు అకౌంటింగ్ గ్రూపులు
    • కంపనీ డాటా: మైగ్రేషన్, రిపైరు, ఇంపోర్టు, స్ప్లిట్, మొదలైనవి.
  • ఎడిట్ లాగ్ రిపోర్టులో క్రింద పేర్కొన్న వషయాలపై సమాచార సేకరణ:
    • ఏదయినా ఒక మాష్టరు లేదా వోచరులో కల్పింపబడిన వివిధ లాగ్ ల యొక్క సంఖ్యను తెలియచేసే వెర్షన్ నంబరు 
    • జరిగిన కార్యకలాప స్వభావం – క్రియేట్ చేయబడినదా, మార్చబడినదా లేదా తొలగింపబడినదా
    • ఆ కార్యకలాపం జరిపినవారి వివరం
    • ఆ కార్యకలాపం జరిగిన తేదీ, సమయం
  • క్రిత ప్రతి వివరాలతో ప్రస్తుత వివరాలను డ్రిల్ డౌన్ చేయటం ద్వారా పోలిక
    ఇంకా, మరిన్ని వివిధ రకాలయిన వివరాలను కన్ఫిగరు చేసుకొని పోల్చు సౌలభ్యం, ఉదాహరణకు కేవలం మారిన విలువలు, కన్పిగరు కాబడిన విలువలు, మొదలైనవి. 
  • మార్చబడిన మరియు తొలగింపబడిన వాటి వివరాలు:
    • డే బుక్ లో మరియు లెడ్జరువోచర్ల రిపోర్టులోని వోచర్లు 
    • ఛార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోని మాష్టర్లు
  • సేవ్ కాబడిన రిపోర్టు వ్యూ లను కోల్పోకుండా  నిరంతరాయంగా డాటా మైగ్రేషన్

ఇంకా మరిన్ని!

 మీ సంస్ధ లో ఎడిట్ లాగ్ సంబంధిత అవసరాలకు అనుగుణంగా మీరు క్రింద తెలిపిన ప్రోడక్టులలో ఏదయినా ఎంచుకోవచ్చు:

  • TallyPrime Edit Log Release 2.1: దీనిలో ఎడిట్ లాగ్ తీసివేసే లేదా నిష్క్రియం చేసే వీలు లేదు, కావున, మీ కంపనీ all the compliance requirements of Audit Trail  తీరుస్తుంది
  • TallyPrime Release 2.1: మీరు అవసరం అనుకున్నప్పుడు ఎడిట్ లాగ్ ఆక్టివేట్ చేసుకుని, కీలక కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు.  ఇది మాష్టర్లలో కానీ వోచర్లలో కానీ జరిగిన మార్పుచేర్పులను ట్రాక్ చేయడం ద్వారా మీకు ఇటువంటి వ్యవహారాలపై పట్టు లభింపచేస్తుంది.

మరిన్ని వివరాలకు Edit Log in TallyPrime చూడండి 

PDF డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకం

TallyPrime Edit Log Release 2.1 మరియు TallyPrime Release 2.1 డాంగుల్ ద్వారా చేసే డిజిటల్ సంతకాలను సపోర్టు చేస్తాయి. 

మీరు వోచర్లు లేదా రిపోర్టులపై నిరాటంకముగా డిజిటల్ సంతకం క్రింది విధంగా చేయవచ్చు: 

  • డాక్యుమెంట్లను PDF రూపంలో పంపునపుడు
  • డాక్యుమెంట్లను PDF రూపంలో ఈ-మెయిల్ చేయునపుడు
  • డాక్యుమెంట్లను PDF రూపంలో సేవ్  చేసినపుడు

ఇంకా మీరు మల్టీ వోచరు రిపోర్టుల నుండి కూడా డిజిటల్ సంతకం జోడించవచ్చు – దీనితో అన్ని వోచర్లపై ఒకేసారి డిజిటల్ సంతకం జోడింపబడుతుంది.

మీరు మీ వ్యాపారసంబంధిత వ్యక్తులకు గాని, కష్టమర్లకు గాని, ఆడిటర్లు మరియు ఛార్టర్డ్ అకౌంటంట్లకు గాని PDF డాక్యుమెంట్లు డిజిటల్ గా సంతకం చేసి పంపినట్లయితే, అవి నిబద్ధత మరియు సమగ్రతలను కలిగియుండి,  వాటిలో అక్రమంగా దిద్దుట, తిరగదీయుట/రాయుట వంటివి నివారింపబడతాయి.

మరిన్ని వివరాలకు Digital Signature in TallyPrime for PDF Documents చూడండి 

ఇంకా మరిన్ని!

మీరు మల్టీ వోచరు రిపోర్టుల నుండి ప్రింటు, ఈ-మెయిలు లేదా ఎక్సపోర్టు చేయునపుడు నిర్దిష్ట పార్టీ మరియు పీరియడ్లకు చేయవచ్చు

మరిన్ని వివరాలకు Multi-Voucher/Invoice for a selected party చూడండి.

Post a Comment

Is this information useful?
YesNo
Helpful?