Explore Categories

 

 PDF

TallyPrime Release 2.0.1 రిలీజ్ నోట్సు

TallyPrime తో మీ ప్రయాణం సంతోషకరంగా ఉంచటానికి మా పై నమ్మకముంచండి –  ప్రోడక్టులో క్రొత్త ఫీచర్లను జతపరచటానికి మరియు సమస్యలను పరిష్కరించటానికి మేము నిరంతరం కృషిచేస్తున్నాము – దీని వలన మీరు మరింత సరళమైన మరియు నిరంతరాయమైన అనుభూతిని పొందగలరు.

TallyPrime Release 2.0.1 యొక్క ముఖ్యాంశాలు

బాటమ్ బటన్ బార్ ఉపలభ్యత

క్రొత్తగా పరిచయం చేయబడిన బాటమ్ బటన్ బార్ ద్వారా మీరు  ఇప్పుడు సులభంగా షార్ట్ కట్ కీలను ఉపయోగించగలుగుతారు. ఇది మీరు త్వరితగతిన ప్రోడక్టు నేర్చుకుని, మీ సమర్ధతను పెంపొందించటంలో సహాయపడుతుంది.

 అవసరంలేనపుడు ఈ బాటమ్ బటన్ బార్ ను మరుగునఉంచే సౌలభ్యం కూడా ఉంది.

TallyPrime లో నోటిఫికేషన్లు

ఇప్పుడు TallyPrime మీకు ఈ దిగువ సమాచారం పై సమయానుసారంగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది:

  • TallyPrime యొక్క క్రొత్త రీలీజులు
  • TSS చెల్లుబాటు మరియు పునరుద్ధరణ
  • రెంటల్ లైసెన్సు గడువు మరియు పునరుద్ధరణ

ఇవే కాకుండా మీ లైసెన్సుకు సంబంధించిన సమస్యల సమాచారం కూడా మీ దృష్టికి తేబడతాయి.

ఈ నోటిఫికేషన్లు మీరు క్రొత్త రిలీజు కు అప్ గ్రేడు అయి, ప్రోడక్టు లోని సరిక్రొత్త ఆవిష్కరణల లబ్ధి పొందటంలో సహాయపడతాయి.  అంతే కాక TSS లేదా రెంటల్ లైసెన్సు గడువు మరియు పునరుద్ధరణ సంబంధ జాగృత సమాచారం మీరు నిరాటంకంగా పని చేసుకోగలగడానికి తోడ్పడుతుంది. 

అంతేకాదు! అవసరంలేదనుకుంటే, ఈ నోటిఫికేషన్లను మీరు తాత్కాలికంగా ఆపివేయవచ్చు.

TallyPrime Release 2.0.1 – ప్రోడక్టు మెరుగుదలలు

MS Excel కు డేటా ఎక్స్ పోర్టు

TallyPrime Release 2.0.1 లో, MS Excel కు డేటా ఎక్స్ పోర్టు చేయునపుడు ఉన్న దిగువ సమస్యలు పరిష్కరింపబడినవి:

MS Excel కు అన్ని లెడ్డరు ఎక్కౌంట్స్ మరియు గ్రూప్ ఆఫ్ఎక్కౌంట్స్ ఎక్స్ పోర్టు

అన్ని లెడ్డరు ఎక్కౌంట్స్ మరియు గ్రూప్ ఆఫ్ఎక్కౌంట్స్ ఎక్స్ పోర్టు చేయునపుడు క్రింది సమస్యలు ఎదురయ్యేవి  :

  • ఈ ప్రక్రియ అనుకున్నదాని కన్నా ఎక్కువ సమయం తీసుకోవడం
  • షీట్లలో డేటా  కూర్పు సరిగ్గాలేక పోవడం
     ఈ సమస్యలు పరిష్కరింపబడినవి

MS Excel కు బ్యాంకు పుస్తకాల ఎక్స్ పోర్టు

MS Excel కు బ్యాంకు పుస్తకాలను ఎక్స్ పోర్టు చేసేటపుడు Memory Access Violation లోపం కనపడడం జరిగేది.

కంపనీ డేటాలో చాలా ఎక్కువ బ్యాంకు లెడ్జర్లు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుండేది.

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరింపబడినది. 

కాస్టు సెంటరు రిపోర్టుల ఎక్స్ పోర్టు, ఈమెయిలు మరియు ముద్రణ

కాస్టు సెంటరు రిపోర్టులలో ఎక్స్ పోర్టు / ఈమెయిలు చేసినపుడు లేదా ముద్రించినపుడు Show Opening Balance కాన్ఫిగరేషను వర్తింపచేయనప్పటికీ,  ప్రారంభ నిల్వ చూపబడేది.

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరింపబడినది.

 

టీడీయస్ అవుట్ స్టాండింగు రిపోర్టు ఎక్స్ పోర్టు లేదా ముద్రణ

లావాదేవీల వారీగా టీడీయస్ అవుట్ స్టాండింగు రిపోర్టు  ఎక్స్ పోర్టు చేయునపుడు లేదా ముద్రించేటపుడు న్యాచుర్ ఆఫ్ పేమెంట్ కనిపించేది కాదు. 

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరింపబడినది. 

సెలక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా డేటా రీస్టోర్

కంపనీ బ్యాకప్ రీస్టోరు చేయునపుడు లిస్ట్ అఫ్ కంపనీస్ లో కంపనీలు కనబడేవి కావు.

ఇది సెలక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఆప్షను వాడినపుడు సంభవించేది

ఈ సమస్య ఇప్పుడు పరిష్కరింపబడినది. 

Post a Comment

Is this information useful?
YesNo
Helpful?